వసీం అక్రమ్ కు మాంచెస్టర్ విమానాశ్రయంలో చేదు అనుభవం
- మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ వాడుతున్న అక్రమ్
- బ్యాగులో ఉన్న ఇన్సులిన్ సీసాలను చెత్తబుట్టలో వేసిన ఎయిర్ పోర్టు సిబ్బంది
- ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసిన పాకిస్థాన్ పేస్ దిగ్గజం
అక్రమ్ బ్యాగ్ లో ఉన్న ఇన్సులిన్ సీసాలను బయటికి తీసి అందరి ముందు పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. అక్రమ్ వివరణను పట్టించుకోకుండా ఆ ఇన్సులిన్ సీసాలను చెత్తబుట్టలో వేశారు. ఇతర ప్రయాణికులు చూస్తుండగానే ఇదంతా జరిగిందని, తాను ఎంతో అవమానానికి గురయ్యానని అక్రమ్ ట్విట్టర్ లో బాధను వ్యక్తం చేశాడు.
అక్రమ్ ట్వీట్ పై స్పందించిన మాంచెస్టర్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు, తమకు నేరుగా సందేశం పంపిస్తే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకుంటామని పేర్కొనగా, ఇంత త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ అక్రమ్ బదులిచ్చారు.