ఇక టెస్టు క్రికెట్లోనూ జెర్సీలపై నంబర్లు!
- మరికొన్ని రోజుల్లో యాషెస్ సీరీస్
- యాషెస్ సిరీస్ తో అమల్లోకి రానున్న కొత్త విధానం
- ప్రారంభం కానున్న ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్
ఇక, కాంకషన్ సబ్ స్టిట్యూట్ ను కూడా యాషెస్ సిరీస్ తో ప్రవేశపెడుతున్నారు. కాంకషన్ సబ్ స్టిట్యూట్ అంటే, ఎవరైనా ఆటగాడు తలకు బలమైన దెబ్బ తగిలి ఆటలో కొనసాగే అవకాశం లేకపోతే, అతడికి బదులుగా మైదానంలో దిగే సబ్ స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేయొచ్చు. అంతేగాకుండా, యాషెస్ సిరీస్ తోనే ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ కూడా ప్రారంభం కానుంది. ఇకమీదట టెస్టు క్రికెట్ ఆడే దేశాలు ఈ చాంపియన్ షిప్ లో భాగంగా ఇతర జట్లతో టెస్టు మ్యాచ్ లు ఆడతాయి.