Uttar Pradesh: అయోధ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రాముడి విగ్రహం... యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం

షార్ట్స్‌లో చూడండి
అయోధ్యలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తయిన శ్రీరాముడి విగ్రహం నిర్మిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ విగ్రహం 251 మీటర్ల ఎత్తుంటుందని తెలిపారు. గుజరాత్ లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే ఇది ఇంకా ఎత్తు ఉంటుంది. పటేల్ విగ్రహం ఎత్తు 183 మీటర్లు. 100 ఎకరాల ప్రదేశంలో రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు యోగి వెల్లడించారు. విగ్రహ నిర్మాణం విషయంలో తాము గుజరాత్ ప్రభుత్వ సాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. పర్యాటకులకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, డిజిటల్ మ్యూజియం, గ్రంథాలయం, ఫుడ్ ప్లాజా, రామాయణం ఇతివృత్తం నేపథ్యంలో పార్కులు, భారీ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.
Go Back to Shorts
Uttar Pradesh
Yogi Adithyanath

More Telugu News