నేను హిట్ లలో ఉంటేనే మహేశ్ నాతో సినిమా చేస్తాడు!: సంచలన వ్యాఖ్యలు చేసిన పూరి జగన్నాథ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను హిట్ లలో ఉంటేనే మహేశ్ నాతో సినిమా చేస్తాడు!: సంచలన వ్యాఖ్యలు చేసిన పూరి జగన్నాథ్

  • మహేశ్ కంటే ఆయన ఫ్యాన్సే నాకు చాలా ఇష్టం
  • నా మీద వాళ్లకి ఎంతో నమ్మకం 
  • మహేశ్ తో సినిమాకు ఓకే చెప్పడానికి నాక్కూడా క్యారెక్టర్ ఉండాలి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుపై దర్శకుడు పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ, ''నేను ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ... మహేశ్ బాబుతో సినిమా చేయాలని ప్రతిరోజు ఆయన అభిమానులు నన్ను అడుగుతుంటారు. 'జనగణమన' సినిమా మహేశ్ తో చేయండన్నా అని అంటుంటారు. మహేశ్ తో రెండు మంచి సినిమాలు చేశానని నాపై వారికి అభిమానం ఉంది. కానీ, అభిమానులకు అర్థం కానిదేమంటే... నేను హిట్ లలో ఉంటేనే మహేశ్ నాతో చేస్తాడు. మహేశ్ కంటే మహేశ్ ఫ్యాన్సే నాకు చాలా ఇష్టం. ఈ విషయాన్ని మహేశ్ ఫ్యాన్స్ కి చాలా సార్లు చెబుదామనుకున్నా. నా మీద వాళ్లకు ఎంతో నమ్మకం ఉంది' అని చెప్పాడు.

'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత మహేశ్ తో సినిమా తీస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... 'నేను ఓకే చెప్పడానికి నాకు కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి కదా?' అని వ్యాఖ్యానించారు.
Mahesh Babu
Puri Jagannadh
Tollywood

More Telugu News