యడ్యూరప్ప మళ్లీ సీఎం కావాలని కోరుతూ 1001 మెట్లెక్కిన బీజేపీ మహిళా ఎంపీ!
- చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఆ ఆలయానికి మెట్లెక్కి వెళ్లిన ఎంపీ శోభ కరండ్లజే
- ఆమె వెంట బీజేపీ కార్యకర్తలు, అభిమానులు
ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారే కాదు, మొక్కులు మొక్కు కుంటున్న వారూ లేకపోలేదు. బీజేపీ ఎంపీ శోభ కరండ్లజే అయితే మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ ఆలయానికి ఆమె వెళ్లేందుకు 1001 మెట్లను ఎక్కారు. ఆమె వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.