జగన్ పాలనపై ఎవ్వరికీ నమ్మకం లేదు: బుద్ధా వెంకన్న

  • పెట్టుబడిదారులు, బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారు
  • రాష్ట్ర పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో?
  • విభజన తర్వాత ఏపీకి అప్పులే మిగిలాయి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విమర్శలు చేశారు. జగన్ పాలనపై ఎవ్వరికీ నమ్మకం లేదని, అందుకే, ఆయన అధికారంలోకి రాగానే పెట్టుబడిదారులు, బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ఆస్తుల గురించి ప్రస్తావించారు. విభజన తర్వాత తెలంగాణకు ఆస్తులు, ఏపీకి అప్పులే మిగిలాయని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
cm
jagan
Telugudesam
buddha

More Telugu News