తాను గతజన్మలో ప్రిన్సెస్ డయానా అంటున్న ఆస్ట్రేలియా బాలుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాను గతజన్మలో ప్రిన్సెస్ డయానా అంటున్న ఆస్ట్రేలియా బాలుడు!

  • 1997లో మరణించిన ప్రిన్సెస్ డయానా
  • ఆమె మరణానంతరం 18 ఏళ్లకు జన్మించిన బిల్లీ క్యాంప్ బెల్
  • ఫొటోలో డయానాను చూసి ఇది తానేనని చెప్పి తండ్రిని ఆశ్చర్యానికి గురిచేసిన వైనం
ఆస్ట్రేలియాకు చెందిన బిల్లీ అనే నాలుగేళ్ల బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానానంటూ సంచలనం సృష్టిస్తున్నాడు. బిల్లీ తండ్రి పేరు డేవిడ్ క్యాంప్ బెల్. డేవిడ్ ఆస్ట్రేలియాలో ప్రముఖ టీవీ ప్రజెంటర్ గా గుర్తింపు పొందాడు. ఒకరోజు డయానా ఫొటో చూసిన అతని కుమారుడు బిల్లీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలా చూడు! అప్పట్లో నేను యువరాణిగా ఉన్నప్పటి ఫొటో ఇది అంటూ చెప్పడంతో డేవిడ్ ఆశ్చర్యపోయాడు.

తన ప్రియుడితో కలిసి మీడియా ప్రతినిధుల బారినుంచి తప్పించుకునే క్రమంలో ప్రిన్సెస్ డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత 18 ఏళ్లకు పుట్టిన తన కుమారుడు బిల్లీ ఇప్పుడు తానే ప్రిన్సెస్ డయానా అంటుండడం పట్ల ఏంచేయాలో అర్థంకాక డేవిడ్ క్యాంప్ బెల్ తల పట్టుకుంటున్నాడు. ఫొటోతో సరిపెట్టకుండా, ప్రిన్సెస్ డయానా బాల్యంలోని విషయాలను కూడా పూసగుచ్చినట్టు చెప్పడం, విలియం, హ్యారీలను తన కొడుకులు అని పేర్కొనడంతో డేవిడ్ కు మతిపోయినంత పనైంది.

అయితే, షాక్ కలిగించే అంశం ఏంటంటే, డయానా సోదరుడు జాన్ పుట్టిన కొన్ని గంటల్లోనే పురిట్లోనే చనిపోయాడు. ఇప్పుడా జాన్ గురించి కూడా బిల్లీ చెబుతుండడం మరింత విస్తుగొలుపుతోంది.
Princess Diana
Australia
Billy Campbell

More Telugu News