కుల్ భూషణ్ కేసును వాదించిన హరీశ్ సాల్వేపై సుష్మ స్వరాజ్ ప్రశంసలు
- కుల్ భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ ఐసీజే తీర్పు
- సాల్వే ప్రభావవంతంగా వాదించారన్న సుష్మ
- కేసును ముందుకు తీసుకెళ్లారంటూ ప్రధానికి కృతజ్ఞతలు చెప్పిన సుష్మ
అంతేగాకుండా, జాదవ్ కేసును మరింత ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సుష్మ కృతజ్ఞతలు తెలిపారు. ఐసీజే తీర్పుతో భారత్ లో ఉన్న జాదవ్ కుటుంబానికి ఎంతో సాంత్వన చేకూరిందని సుష్మ అన్నారు. కాగా, ఈ కీలకమైన కేసులో కుల్ భూషణ్ తరఫున న్యాయవాదిగా వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే కేవలం రూ.1 ఫీజుగా తీసుకున్నారు.