బీజేపీని సీరియస్ గా తీసుకోవద్దంటూనే కేసీఆర్ వణికిపోతున్నారు: ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా
- కేసీఆర్ ది మేకపోతు గాంభీర్యం
- బీజేపీ ఎంపీలు నలుగురే గెలిచారని ఎగతాళి చేస్తారా?
- ఆ నలుగురే టీఆర్ఎస్ ను గద్దె దించుతారు
సార్వత్రిక ఎన్నికల్లో తన కూతురుని గెలిపించుకోలేని కేసీఆర్ ఇంకా పార్టీని ఏం కాపాడతారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని కూలగొట్టాలన్న నిర్ణయం సబబు కాదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో టీఆర్ఎస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓటర్లను మారుస్తున్నారని, ఓటర్ల జాబితా సరిగా లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ తమకు అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుని హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరికాదని అన్నారు. అందరినీ కేసీఆర్ భయపెడుతున్నారని, ఆయనకు దమ్మూధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు.