బ్రేకింగ్ న్యూస్: కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు
- భారత్ కు అనుకూల తీర్పు ఇచ్చిన ఐసీజే
- అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు భారీవిజయం
- పాకిస్థాన్ కు చెంపపెట్టు
భారత గూఢచార సంస్థ 'రా' కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్ భూషణ్ ను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఏకపక్ష విచారణ జరిపి కుల్ భూషణ్ కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ నెదర్లాండ్స్ లోని 'ద హేగ్'లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. దీనిపై విచారణలో భాగంగానే తాజా తీర్పు వెలువడింది. అంతర్జాతీయంగా భారత్ కు ఇది భారీ విజయం అని చెప్పాలి. మరోవైపు భారత్ ను అంతర్జాతీయంగా అప్రదిష్ఠపాల్జేయాలని చూస్తున్న పాక్ కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని భావించాలి.