అసెంబ్లీని కేసీఆర్ కుటుంబ వ్యవహారంగా మార్చేశారు.. ఆయనకు జైలుశిక్ష తప్పదు!: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్
- ప్రశ్నించేవారిని కేసీఆర్ అణచివేస్తున్నారు
- రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
తన నిర్వాకాలపై ప్రశ్నించేవారిని కేసీఆర్ అణచివేస్తున్నాడని సంపత్ కుమార్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రజల సొమ్మును రాజకీయ అవసరాలకు కేసీఆర్ వాడుకుంటున్నారనీ, ఆయనకు భవిష్యత్తులో జైలుశిక్ష తప్పదని సంపత్ కుమార్ హెచ్చరించారు.