జన్మభూమి కమిటీలకు, వీటికి తేడా ఏముంది?: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామ వాలంటీర్ల నియామకాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. టీడీపీ జన్మభూమి కమిటీల్లాగానే వాలంటీర్ల నియామకం కూడా ఉందని విమర్శించారు. టీడీపీ అవినీతి పార్టీగా మారడంతోనే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుక కూడా దొరకని పరిస్థితి నెలకొందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కూడా లేకుండా పోయిందని చెప్పారు. నిర్మాణరంగం కుదేలయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Vishnu Kumar Raju
BJP
YSRCP
Village Volunteers

More Telugu News