వార్షికాదాయం రూ.8 లక్షల లోపున్న వారికి మమత సర్కారు తీపి కబురు
- రాష్ట్ర ప్రజలపై మమత వరాల జల్లు
- ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పది శాతం రిజర్వేషన్
- వారం రోజుల్లోపే రెండో ప్రకటన
అయితే, వార్షిక ఆదాయం మాత్రం 8 లక్షల లోపు ఉండాల్సిందేనని నిబంధన విధించింది. అన్ని రకాలుగా వచ్చే ఆదాయం అంటే వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తి.. తదితర వాటిపై వచ్చే మొత్తం కలిపినా రూ. 8 లక్షలు దాటని వారే ఇందుకు అర్హులని తెలిపింది. కాగా, అంతకుముందే మమత ప్రభుత్వం జనరల్ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతలోనే మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.