అనంత పోలీసన్న సరదా... స్టేషన్లో అర్ధనగ్నంగా, దర్జాగా..!
- స్టేషన్ కు ప్యాంట్ లేకుండా వచ్చిన కానిస్టేబుల్
- రహస్యంగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకులు
- విషయం ఉన్నతాధికారుల దృష్టికి
ఇక్కడ విధులు నిర్వహించే కానిస్టేబుల్ సుధాకర్, ఒంటిపై యూనిఫారం కాకుండా సాధారణ చొక్కా, డ్రాయర్ తో స్టేషన్ కు వచ్చాడు. స్టేషన్ లో దర్జాగా తిరిగాడు. కుర్చీలో కూర్చుని బాతాఖానీ పెట్టాడు. దీన్ని చూసిన కొందరు రహస్యంగా ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయి, జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకూ వెళ్లాయి. ఇక ఉన్నతాధికారులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.