ఇంగ్లాండ్ 'సూపర్' సక్సెస్... ప్రపంచకప్ గెలిచిన మోర్గాన్ సేన!

  • సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ ఓటమి
  • వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టైటిల్ నెగ్గిన ఇంగ్లీష్ టీమ్
  • రోమాంఛకంగా సాగిన ఫైనల్ మ్యాచ్ 
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కు సిసలైన ముగింపు లభించింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీయగా, సూపర్ ఓవర్ లో పోరాడి మరీ విజయాన్నందుకున్న ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో స్కోర్లు సమం కాగా, పోరు సూపర్ ఓవర్ కు దారితీసింది.

మొదట ఒక ఓవర్ ఆడిన ఇంగ్లాండ్ 15 పరుగులు చేసింది. అయితే, విజయానికి కచ్చితంగా 16 పరుగులు చేయాల్సిన స్థితిలో న్యూజిలాండ్ కూడా సరిగ్గా 15 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా అవతరించింది. వరల్డ్ కప్ చరిత్ర ప్రారంభమై 44 ఏళ్లు కాగా, ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్లో నిరాశచెందిన ఇంగ్లీష్ జట్టు ఈసారి సొంతగడ్డపై మాత్రం టైటిల్ ను వదిలిపెట్టలేదు.
Go Back to Shorts
England

More Telugu News