vizag: ‘విశాఖ’లో యువకుడి దారుణ హత్య !

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్టణం జిల్లా చోడవరంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపై నరికేశాడు. స్థానిక బీఎన్ రోడ్డు ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడు కోన రాజేశ్ (21) చోడవరంలోని యడ్లవీధికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ధరించి బైక్  పై వచ్చిన దుండగుడు రాజేశ్ ను కత్తితో నరకడంతో కిందపడిపోయాడు.

వెంటనే అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లిపోయిన దుండగుడు మళ్లీ వెనక్కి వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న రాజేశ్ పై మరోసారి తన కత్తితో పొడిచి పారిపోయినట్టు స్థానికుల సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
vizag
youth
murder
prakasam
students

More Telugu News