నల్లమల అడవుల్లో క్షుద్రపూజలు...నరబలి జరిగిందన్న అనుమానాలు?
- తల, మొండెం వేరైన యువకుడి మృతదేహం లభ్యం
- కాల్వలో పాతిపెట్టిన మృతదేహం
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
యువకుని మృతదేహం తల, మొండెం వేరుగా ఉండడం, ఎరుపురంగు పూసి ఉండడం, నిమ్మకాయలు, నీలిరంగు అంగి, జీన్స్‌ప్యాంట్, కాలి వేలికి రింగు, చేతికి వెండి ఉంగరం, బెల్టు లభ్యం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. సమీపంలోనే క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో గుప్త నిధులకోసం ఎవరైనా నరబలికి పాల్పడి ఉంటారని, యువకుడినే బలిచ్చి పాతిపెట్టారని అనుమానిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.