పురుషుడి పొట్టలో గర్భసంచి.. ఆడా, మగా? తేల్చేందుకు వైద్య పరీక్షలు!
- వివాహమై రెండేళ్లయినా కలగని సంతానం
- గర్భసంచిని గుర్తించి విస్తుపోయిన వైద్యులు
- విజయవంతంగా తొలగింపు
బాధితుడికి పరీక్షలు నిర్వహించిన ముంబై జేజే ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ గీతే.. అతడు లింగపరంగా పురుషుడేనని తేల్చారు. అనంతరం శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిని తొలగించారు. ఆ తర్వాత నిర్వహించిన మరో శస్త్రచికిత్స ద్వారా అతడి వృషణాల్లో అండాశయాలను చొప్పించారు. జేజే ఆసుపత్రికి ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి కాగా, ప్రపంచవ్యాప్తంగా 200 మంది పురుషుల్లో గర్భసంచి ఉన్న ఘటనలు ఇప్పటి వరకు వెలుగుచూశాయి.