Mojo: 'మోజో' టీవీ మాజీ సీఈఓ రేవతి అరెస్ట్

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ చానెల్ మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నామని బంజారాహిల్స్‌ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉదయం రేవతి ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు, అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, అక్కడి నుంచి నేరుగా ఆమెను పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. రేవతి అరెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Mojo
Revati
Arrest
Ex CEO

More Telugu News