ఏం చేసుకుంటారో చేసుకోండి: జర్నలిస్టులపై కంగనా రనౌత్ దుర్భాషలు
- ఫ్రీగా భోజనాలు చేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు
- మిమ్మల్ని జర్నలిస్టులని ఎలా పిలవాలి
- నా స్టేటస్ ను మీరు దెబ్బతీయగలరా?
'ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని జర్నలిస్టులని ఏ ఆధారంతో పిలవాలి? నన్ను బ్యాన్ చేయమని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే, నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీలాంటి సూడో జర్నలిస్టులు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?' అని వీడియోలో కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'మణికర్ణిక' సినిమా సమయంలో మూవీ మాఫియా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు... తనకు అండగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది.