భారత్ లో స్మార్ట్ ఫోన్లకు కొత్త ముప్పు... 'ఏజెంట్ స్మిత్'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ లో స్మార్ట్ ఫోన్లకు కొత్త ముప్పు... 'ఏజెంట్ స్మిత్'!

  • గూగుల్ యాప్ లా భ్రమింపజేస్తూ ఫోన్లలో చొరబాటు
  • ఫోన్ వినియోగదారుకు తెలియకుండానే కార్యకలాపాలు
  • భారత్ లో 1.5 కోట్ల ఫోన్లపై మాల్వేర్ పంజా
టెక్నాలజీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నా, ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అనేక ప్రతికూల శక్తులు కూడా స్వైరవిహారం చేస్తుంటాయి. అలాంటివాటిలో వైరస్ లు, మాల్వేర్లు ప్రధానమైనవి. ఇవి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లలో చొరబడి డేటా తస్కరించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ఊహించనలవి కాని నష్టాన్ని కలుగజేస్తుంటాయి. తాజాగా, ఏజెంట్ స్మిత్ పేరుతో ఓ కొత్త మాల్వేర్ భారత్ లోని స్మార్ట్ ఫోన్లపై దాడిచేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఏజెంట్ స్మిత్ బారిన పడినట్టు గుర్తించారు.

ఒక్క మన దేశంలోని 1.5 కోట్ల స్మార్ట్ ఫోన్లపై ఈ మాల్వేర్ పంజా విసిరినట్టు సమాచారం. ఇది గూగుల్ సంబంధిత యాప్ రూపంలో స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించి, అప్పటికే ఇన్ స్టాలైన యాప్ లను ఇష్టానుసారం తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, కొన్ని యాప్స్ సోర్స్ కోడ్ ను కూడా మార్చివేస్తుందట! తన ప్రొఫైల్ లో యాడ్స్ చూపించి ఆండ్రాయిడ్ ఫోన్లను ఇది ఏమార్చుతుందని, ఇది తమ ఫోన్ లో ఉందన్న సంగతి తెలుసుకునేసరికి ఎంతో డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.
Malware
Agent Smith
Smart Phone

More Telugu News