నాకు కొంచెం ప్రేమ, గౌరవం, ప్రశాంతత కావాలి: శ్రుతి హాసన్
- నన్ను నేను పట్టించుకునే తీరిక కూడా లేదు
- ఇలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తికీ వస్తుంది
- ఇంత కాలం పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా
- ప్రస్తుతం ఆ విమర్శలేవీ నన్ను బాధించట్లేదు
తనకు పెళ్లై పోయిందని, అందుకే లావెక్కానని, ఇలా తనపై నెటిజన్లు చాలా విమర్శలు గుప్పించారని పేర్కొంది. ఆ కామెంట్లు తనను చాలా బాధించేవని కానీ తన అనారోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియదు కదా అని సరిపెట్టుకున్నానని తెలిపింది. తనను తాను పట్టించుకునేంత తీరిక గత పదేళ్లలో లేదని.. ఇలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తికీ వస్తుందన్నారు. ఇంత కాలం పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, కానీ ప్రస్తుతం తనను అవేమీ బాధించట్లేదని శ్రుతి తెలిపింది. తనకు కాస్త ప్రేమ, గౌరవం, ప్రశాంతత కావాలని పేర్కొంది.