ఇంటర్వ్యూల ద్వారా గ్రామ వాలంటీర్ల ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
- శరవేగంగా నియామక ప్రక్రియ
- రేపటి నుంచే ఇంటర్వ్యూలు
- ఆగస్ట్ 15 నుంచి విధుల్లోకి తీసుకోవాలని ప్రణాళిక
రేపటి నుంచి గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 1న అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ శిక్షణ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఆగస్ట్ 15న విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇదే సమయంలో పిటిషన్ దాఖలవడం ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ రేపే జరిగే అవకాశం ఉంది.