Rana: అందుకే రానా బాగా సన్నబడ్డాడట

షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా, ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. అలాగే ఆయన తెలుగులో 'విరాటపర్వం' సినిమా చేస్తున్నాడు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. దాంతో రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అలాంటిదేం లేదని చెప్పాడు.

'హాథీ మేరే సాథీ' సినిమా కోసమే సన్నబడాల్సి వచ్చిందని అన్నాడు. అడవిలోనే 30 సంవత్సరాలు వుండిపోయిన వ్యక్తి పాత్రలో నేను కనిపించాలి. ఈ పాత్ర కోసం నేను సన్నాబడాలని దర్శకుడు చెబితే అలాగే తగ్గుతూ వచ్చాను. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత మళ్లీ కండపట్టేస్తానని ఆయన చెప్పాడు. మొత్తానికి తన గురించి జోరుగా సాగుతోన్న ప్రచారానికి రానా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. 
Go Back to Shorts
Rana

More Telugu News