సభను హుందాగా నడుపుతాం: మంత్రి కన్నబాబు
- 23 అంశాలపై సభలో చర్చించాలని నిర్ణయించాం
- ప్రతిపక్షానికి కావాల్సిన సమయం ఇస్తాం
- గతంలో మాదిరి ప్రతిపక్ష పార్టీకి మైక్ కట్ చేయడం ఉండదు
సభను అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని జగన్ స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన సమయం ఇస్తామని, గతంలో చేసిన విధంగా ప్రతిపక్ష పార్టీకి మైక్ కట్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు సభ జరపాలో ప్రతిపక్షాన్ని జగన్ కోరారని, దీనికి ప్రతిపక్ష పార్టీ సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్షం అభిప్రాయాన్ని కోరామని, శాంతి భద్రతల అంశం ఒక్క దానిపైనే ప్రతిపక్షం చర్చ కోరిందని కన్నబాబు చెప్పారు.