దసరాకి రంగంలోకి దిగనున్న అనుష్క 'సైలెన్స్'
- 'నిశ్శబ్దం' చిత్రీకరణలో అనుష్క
- విదేశాల్లో 50 శాతం షూటింగ్ పూర్తి
- తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల
మాధవన్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను 'దసరా'కి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అందువలన తెలుగుతో పాటే కొన్ని సన్నివేశాలను తమిళ .. హిందీ భాషల్లో అక్కడి నటీనటులతోనే షూట్ చేస్తున్నారు. తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, తమిళ .. హిందీ భాషల్లో 'సైలెన్స్' టైటిల్ తోను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.