ఆ సమయంలో రెండు తప్పులు చేస్తే.. మ్యాచ్ ప్రత్యర్థి చేతుల్లోకి పోతుంది: కోహ్లీ
- సెమీస్ లో ఒత్తిడి కీలకంగా మారుతుంది
- ఒత్తిడిని ఎదుర్కొన్న జట్టు విజయం సాధిస్తుంది
- ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి
రెండో ఇన్నింగ్స్ ఆడేటప్పుడు ఛేజింగ్ లో ఎంతో ఒత్తిడి ఉంటుందని కోహ్లీ అన్నాడు. ఆ సమయంలో రెండు తప్పులు చేసినా... మ్యాచ్ ప్రత్యర్థుల చేతిలోకి వెళ్లిపోతుందని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ ను మన చేతుల్లోకి తీసుకురావాలంటే చాలా కష్టమని తెలిపాడు. తాను ఎన్నో ఛేజింగ్ లు చూశానని... ఆ అనుభవంతోనే ఈ మాట చెబుతున్నానని అన్నాడు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా టీమిండియా సిద్ధంగా ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.