నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్న జగన్

  • ఈరోజు విజయవాడకు రానున్న నరసింహన్
  • గంటసేపు గవర్నర్ తో జగన్ భేటీ
  • పలు అంశాలపై జరగనున్న చర్చ
ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు భేటీ కానున్నారు. నరసింహన్ ఈరోజు విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బస చేసే హోటల్ కు వెళ్లి... ఆయనను మర్యాదపూర్వకంగా జగన్ కలుసుకుంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీరిరువురు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.  
Go Back to Shorts
Narasimhan
Governor
Jagan
AP CM
YSRCP

More Telugu News