వందేళ్ల నాటి కారులో భార్యతో కలిసి సచిన్ లండన్ వీధుల్లో విహారం
- ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ లో ఉన్న సచిన్
- లండన్ రాయల్ ఆటోమొబైల్ క్లబ్ సందర్శన
- సెయింట్ జేమ్స్ వీధిలో మీడియా కంటబడిన వైనం
అక్కడ ఉన్న 119 ఏళ్ల నాటి విక్టోరియా కారు సచిన్ ను బాగా ఆకట్టుకుంది. దాంతో అక్కడివారిని అడిగి దాన్ని ఎలా డ్రయివ్ చేయాలో ఆకళింపు చేసుకున్నాడు. ఆపై, తన అర్ధాంగి అంజలితో కలిసి ఆ కారును నడుపుకుంటూ లండన్ వీధుల్లో విహరించాడు. ఆ వింటేజ్ కారును స్వయంగా నడుపుతూ సెయింట్ జేమ్స్ వీధిలోకి రాగానే మీడియా కంటబడ్డాడు. ప్రస్తుతం సచిన్ వింటేజ్ కార్ డ్రయివింగ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తున్నాయి.