ప్రతి ట్వీట్ నా హృదయాన్ని తాకుతోంది: నటి సమంత
- ‘ఓ బేబీ’ ‘థ్యాంక్స్ మీట్’
- విడుదలకు ముందు రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు
- ప్రతి ట్వీట్ ను చదువుతా.. అందరికీ రిప్లై ఇవ్వలేను
‘ఓ బేబీ’లో తన పాత్రతో ఎంతో సంతృప్తి చెందిన తాను ఈ సినిమా తర్వాత ఇంకేం చేయాలని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాలా? అని నందినీరెడ్డితో తాను ప్రస్తావించిన విషయాన్ని సమంత గుర్తుచేసుకుంది. ఈ సినిమా తర్వాత ఏ చిత్రంలో నటించాలి? ఏ చిత్రంలో నటించకూడదు?అనే తికమకలో ఉన్నానని, అయితే, ఈ స్థితి మరో రెండు రోజులు మాత్రమే ఉంటుందని తనకు తెలుసని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫాలోవర్స్ చేసే ప్రతి ట్వీట్ ను చదువుతాను కానీ, అందరికీ రిప్లై ఇవ్వలేనని చెప్పిన సమంత, ప్రతి ట్వీట్ తన హృదయాన్ని తాకుతోందని చెప్పారు.