కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే యడ్యూరప్పే సీఎం: సదానందగౌడ
- కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
- 14 మంది కూటమి ఎమ్మెల్యేల రాజీనామా
- గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటున్న బీజేపీ
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ కు 78 మంది సభ్యులు ఉండగా, జేడీఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ మెజారిటీకి 113 మంది సభ్యులు అవసరం కావడంతో, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.