Brochevarevarura: 'బ్రోచేవారెవరురా' చిత్రంపై అల్లు అర్జున్ షార్ట్ రివ్యూ

షార్ట్స్‌లో చూడండి
శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ చిత్రం 'బ్రోచేవారెవరురా'. ఈ సినిమా రిలీజై మంచి స్పందన అందుకుంటోంది. తాజాగా, ఈ సినిమాను టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా తిలకించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించారు.

"ఇదో హాస్యభరిత చిత్రం. అంతేకాకుండా మొదటి నుంచి చివరివరకు థ్రిల్లింగ్ గా ఉంది. శ్రీవిష్ణు, నివేదా థామస్, ఇతర నటీనటులు జీవించేశారు, దర్శకుడి పనితనం ప్రతి ఫ్రేములో కనిపించింది. నటుడు శ్రీవిష్ణు ఎప్పుడూ మంచి సినిమాల కోసమే ప్రయత్నిస్తుంటాడు. అతడి తాపత్రయాన్ని నిజంగా అభిమానిస్తుంటాను. చిత్రయూనిట్ కు నా శుభాభినందనలు!" అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్టు చేశారు.
Go Back to Shorts
Brochevarevarura
Allu Arjun
Tollywood

More Telugu News