ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం బాధాకరం: బుగ్గన
- రాజధాని, రెవెన్యూ లోటు ప్రస్తావనే లేదు
- హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరం
- వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఊసే లేదు
వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీపై సైతం ప్రస్తావించలేదని బుగ్గన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే రాజధాని, రెవెన్యూ లోటు ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సాయం సంగతి ఎలా ఉన్నా, నవరత్నాలు, హామీల అమలు విషయంలో రాజీ పడేది లేదని బుగ్గన స్పష్టం చేశారు.