సభ్యత్వ నమోదును వారణాసిలో ప్రారంభించనున్న మోదీ.. హైదరాబాద్‌లో అమిత్ షా
- తెలంగాణపై మరింత దృష్టి సారించనున్న బీజేపీ
- శంషాబాద్‌లో ప్రారంభించనున్న అమిత్ షా
- మేధావులను భాగస్వాములను చేయాలని ఆదేశాలు
రేపు స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్‌లో సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులను, కుల పెద్దలను సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.