Vijay Sai Reddy: ఇండిగో సంస్థకు చంద్రబాబు నెలకు రూ.3 కోట్లు ఇచ్చారు: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. ఎప్పట్లాగానే ఆయన ట్విట్టర్ లో స్పందించారు. పేదవాళ్ల ప్రయాణ సౌకర్యాల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, అందుకే చంద్రబాబును ప్రజలు తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. విజయవాడ-సింగపూర్ మధ్య వారానికి రెండు విమాన సర్వీసులు నడిపినందుకు ఇండిగో సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద నెలకు రూ.3 కోట్లు చెల్లించారని ఆరోపించారు. అదే సమయంలో కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఒక్క రూపాయి ఇవ్వడానికి చంద్రబాబుకు చేతులు రాలేదని విజయసాయి మండిపడ్డారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News