అల్లూరి సీతారామరాజు పోరాటం అన్ని తరాలకూ స్ఫూర్తిదాయకం!: చంద్రబాబు
- అల్లూరి గిరిజనుల కోసం పోరాడారు
- తెలుగువారి దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అన్ని తరాలకూ స్ఫూర్తిదాయకం. ఆ అమరవీరుని ప్రాణత్యాగం తెలుగువారి దేశభక్తిని, పోరాట పటిమను ప్రపంచానికి చాటింది. చిరస్మరణీయుడు అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చరిత్రను మననం చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.