కరకట్టను మేము ఆక్రమించుకోలేదు, మా భూమినే కృష్ణానది ఆక్రమించుకుంది: బీజేపీ నేత గోకరాజు గంగరాజు
- సీఆర్డీఏ నోటీసులపై స్పందించిన గోకరాజు గంగరాజు
- మా భవనం నిర్మించాకే ఆ జీవో వచ్చింది
- ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఉండవల్లిలోని 25 ఎకరాల్లో ఉంటున్నా
ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఉండవల్లిలోని 25 ఎకరాల్లో ఉంటున్నానని, గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతి ఉందని, బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసినా అనుమతి రాలేదని అన్నారు. దీంతో, నది నుంచి 30 అడుగులు వెనక్కి భవనం నిర్మించుకోమని ఇరిగేషన్ అధికారులు తనకు అనుమతిచ్చినట్టు చెప్పారు. కరకట్టపై తాను నిర్మించింది విలాసవంతమైన భవనం కాదని, కేవలం ఫాంహౌస్ మాత్రమేనని అన్నారు. ప్రజావేదికను కూల్చినట్టే అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నదుల వెంబడి ఎన్నో నిర్మాణాలను కూల్చివేయాల్సి వస్తుందని, సీఆర్డీఏ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం చెబుతానని అన్నారు.