maine pyar kiya: గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో నటి భాగ్యశ్రీ భర్త అరెస్ట్

  • భాగ్యశ్రీ భర్త హిమాలయను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
  • సొంత నివాసంలో అదుపులోకి తీసుకున్న వైనం
  • బెయిల్ మంజూరు చేసిన కోర్టు
'మైనే ప్యార్ కియా' సినిమాతో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న నటి భాగ్యశ్రీ. తాజాగా ఆమె భర్త హిమాలయను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అంబోలి పోలీసు అధికారుల సమాచారం మేరకు... హిమాలయను అతని నివాసంలో నిన్న అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యాపారవేత్త అయిన హిమాలయ సినీ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.  
maine pyar kiya
himalaya dasani
bhagyashree
bollywood
arrest

More Telugu News