లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు
- ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి వస్తున్న ప్రయాణికులపై కాల్పులు
- ఇద్దరు మృతి... ఒకరికి గాయాలు
- ఉగ్రకోణం లేదన్న పోలీసులు
కాల్పులు జరిపిన వ్యక్తి ఒక ట్యాక్సీ ద్వారా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. లాంజ్ నుంచి బాధితులు బయటకు వస్తున్న సమయంలో కాల్పులు ప్రారంభించాడని చెప్పారు. కాల్పుల వెనుక ఉగ్రకోణం లేదని... వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ కాల్పులు జరిగి ఉంటాయని తెలిపారు. కాల్పుల నేపథ్యంలో, ఎయిర్ పోర్టుకు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.