kalyan ram: కల్యాణ్ రామ్ హీరోగా 'రావణ'

షార్ట్స్‌లో చూడండి
నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కల్యాణ్ రామ్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో వున్నారు. ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఈ టైటిల్ ఫన్నీగా ఉందనీ .. కథకి తగినట్టుగా అనిపించడం లేదని ఈ సినిమా యూనిట్ భావించిందట.

కథకి తగినట్టుగా పవర్ఫుల్ టైటిల్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. అలా మరో టైటిల్ కోసం గట్టిగానే కసరత్తు చేసి, 'రావణ' అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే నటీనటులను .. సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Go Back to Shorts
kalyan ram

More Telugu News