Vizag: ఓటమిపాలైన వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందొద్దు: మంత్రి మోపిదేవి

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో ఎక్కడ అక్రమ నిర్మాణం ఉన్నా నోటీసులు ఇస్తామని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. ఈ విషయంలో చిన్నాపెద్దా తేడా లేదని అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని, అందుకు, తానే నిదర్శనమని అన్నారు.

చిన్నచిన్న కారణాల వల్ల విశాఖపట్టణంలో వైసీపీ కొన్ని ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయామని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్టణం అభివృద్ధి చెందిందని, జగన్ హయాంలో ఈ జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు.
Go Back to Shorts
Vizag
YSRCP
Minister
Mopi devi
jagan
cm

More Telugu News