కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా?: జీవన్ రెడ్డి
- తెలంగాణకు చెందిన నీటిని ఆంధ్రాకు ఎలా తరలిస్తారు?
- నాడు రాయలసీమకు నీళ్లిస్తామంటే విమర్శించారు
- ఇప్పుడెలా మద్దతిస్తారు?
తాము రాయలసీమకు నీళ్లిస్తామంటే, ఆంధ్రోళ్లకు నీళ్లు దోపిడీ చేస్తున్నారని విమర్శించారని, నీళ్ల తరలింపునకు ఇప్పుడెలా మద్దతిస్తారని మండిపడ్డారు. ప్రాణహిత నది పుట్టిన ఆదిలాబాద్ జిల్లాకు నీ ప్లాన్ ఏది? ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు ఏమయ్యాయి? దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యవాదులతో చర్చలు అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడమేనని విమర్శించారు.