కులాంతర వివాహం చేసుకుందని పచ్చి బాలింతను కడతేర్చిన కన్నతండ్రి
- ప్రేమ వివాహం చేసుకున్న కేశవన్, హేమ
- వారం క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన హేమ
- ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా అడ్డుకున్న తండ్రి, సోదరులు
- మామిడి తోటలోకి తీసుకెళ్లి హేమ హత్య
నేడు శిశువు అనారోగ్యానికి గురవడంతో పలమనేరులోని ఆసుపత్రికి కేశవన్ దంపతులు తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా ఊసరపెంట గ్రామ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద యువతి తండ్రి, సోదరులు వారిపై దాడి చేశారు. హేమను ద్విచక్ర వాహనంపై సమీప మామిడి తోటలోకి తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని బావిలో పడేశారు. స్థానికులు చూసి కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. దీంతో కేశవన్ కుటుంబ సభ్యులు హేమ కుటుంబంపై దాడికి పాల్పడటంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ యుగంధరబాబు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.