చికిత్స అనంతరం లండన్ నుంచి తిరిగొచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీకి ఘనస్వాగతం
- ఉత్సాహంగా కనిపించిన అక్బరుద్దీన్
- శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చిన ఎంఐఎం శ్రేణులు
- గతంలో అక్బర్ పై హత్యాయత్నం
తమ నేత ఆరోగ్యం సంతరించుకుని తిరిగిరావడంతో ఎంఐఎం శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల కిందట అక్బరుద్దీన్ పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. తీవ్రగాయాలపాలైన అక్బరుద్దీన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు కానీ, గాయాలు తీవ్రమైనవి కావడంతో ఆ తర్వాత కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తరచుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో లండన్ లో మెరుగైన చికిత్స కోసం వెళ్లారు.