Hyderabad: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి హఠాన్మరణం

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ కు చెందిన సామ అర్జున్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆస్ట్రేలియాలో హఠాన్మరణం చెందాడు. అర్జున్ రెడ్డి సిడ్నీలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఆఫీసులో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే భార్యకు ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్జున్ రెడ్డి అస్వస్థతకు లోనవడంతో ఆఫీసు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఆయన వయసు 36 సంవత్సరాలు. హైదరాబాద్ లోని వనస్థలిపురం బీడీఎల్ కాలనీ వాసి ఆయన. ఇంజినీరింగ్ అనంతరం ఆస్ట్రేలియా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆపై అక్కడే ఉద్యోగంలో చేరాడు. అర్జున్ రెడ్డికి మహేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఇషిక అనే కుమార్తె ఉంది.
Go Back to Shorts
Hyderabad
Australia

More Telugu News