ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ.... 15 పరుగులకే 2 వికెట్లు డౌన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ.... 15 పరుగులకే 2 వికెట్లు డౌన్

  • ఇంగ్లాండ్ టార్గెట్ 286 రన్స్
  • ఓపెనర్ విన్స్ డకౌట్
  • స్వల్ప స్కోరుకే రూట్ అవుట్
లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాపై లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ సీమర్లు బెహ్రెన్ డార్ఫ్, స్టార్క్ చెరో వికెట్ తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు. 286 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఇంగ్లాండ్ మొదట జేమ్స్ విన్స్ వికెట్ కోల్పోయింది. అప్పటికి స్కోరుబోర్డుపై పరుగులేమీ లేవు. విన్స్ సున్నాకే బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కాసేపటికే స్టార్ బాట్స్ మన్ జో రూట్ కూడా పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ రెండో వికెట్ పతనమైంది. అప్పటికి జట్టు స్కోరు 3.3 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే. రూట్ వికెట్ స్టార్క్ కు దక్కింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ బెయిర్ స్టో (11), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (4) ఆడుతున్నారు.
Australia
England
World Cup
Cricket

More Telugu News