కూల్చివేస్తామన్న ప్రజావేదికలోనే సమావేశం నిర్వహిస్తారా?: బుద్ధా వెంకన్న
- అక్కడే సమావేశం నిర్వహించడం కరెక్టు కాదు
- ప్రజావేదికను కూల్చివేస్తామనడం కక్షసాధింపు చర్యే
- ప్రజా ధనాన్ని వృథా చేయొద్దు
ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబునాయుడు కోరారని, అది కేటాయిండం ప్రభుత్వానికి ఇష్టం లేకనే కూల్చివేస్తున్నట్టు ప్రకటించిందని విమర్శించారు. ఆ వేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకపోతే దానిని మరోవిధంగా ప్రభుత్వం ఉపయోగించుకోవాలే తప్ప ప్రజా ధనాన్ని వృథా చేయకూడదని సూచించారు.