సావిత్రి గారి అంతిమ యాత్రలో ఎవరూ లేరు: మురళీమోహన్

24-06-2019 Mon 14:23
  • సావిత్రిగారు చనిపోగానే వెళ్లామన్న మురళీమోహన్
  • దహన సంస్కారాలయ్యే వరకూ వున్నాము
  • చుట్టుపక్కల గుడిసెల్లో వున్న వాళ్లు ఏడ్చారు     

నటుడిగా .. నిర్మాతగా మురళీమోహన్ ఎన్నో విజయాలను చూశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సావిత్రిని గురించి ప్రస్తావించారు. "నా జీవితంలో నేను చాలా బాధపడిన సందర్భం ఒకటి వుంది .. అదే సావిత్రిగారు చనిపోయిన రోజు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ బాధపడుతూనే వుంటాను.

సావిత్రిగారు చనిపోవడానికి ముందురోజు కొంతమంది వచ్చి చూసివెళ్లారట. ఆమె చనిపోయారని తెలియగానే నేను .. దాసరిగారు .. అక్కినేని నాగేశ్వరరావుగారు హైదరాబాద్ నుంచి బయల్దేరి చెన్నై వెళ్లాము. సావిత్రిగారి దహన సంస్కారాలు పూర్తయ్యేవరకూ అక్కడే వున్నాము. సావిత్రి అంతిమ యాత్రలో ఎవరూ లేరు. చుట్టుపక్కల గుడిసెల్లో వున్నవాళ్లు మాత్రమే ఏడుస్తూ వచ్చారు. ఒక మహానటి జీవితం ఇలా ముగిసిపోయిందేనని చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు.