ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్
- అవినీతి, అక్రమాలు, దోపిడీలకు దూరంగా ఉండండి
- తప్పు చేస్తే ఉపేక్షించను
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి
కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పని చేయాలని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించాలని చెప్పారు.