యాంకర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రానా.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
- చిత్ర పరిశ్రమలు దేనికవే సాటి
- భారతీయులు తెలుసుకోకపోవడం ఆశ్చర్యం
- సినిమా తీసే విధానం ఒకటే
- మనం ఏర్పరిచే వరకూ దేనికీ హద్దులుండవు
చిత్ర పరిశ్రమలు దేనికవే సాటి అని తెలిపాడు. సినిమా తీసే విధానం ఒకటే, కెమెరా, కథ, నటీనటుల బృందం కూడా ఒకేలా ఉంటుందన్నాడు. తెలుగు చిత్ర సీమలో సినిమాలు తీసినట్టే తమిళంలోనూ తీస్తారని... పరిధిని దాటి సినిమాలు తీస్తున్న వారు కూడా ఉన్నారన్నాడు. రజనీకాంత్ సినిమాలు అలాగే అవెంజర్స్ సినిమా అన్ని భాషల్లోనూ డబ్ అయిందన్నాడు. మనం ఏర్పరిచే వరకూ దేనికీ హద్దులుండవనే విషయాన్ని గుర్తించాలని రానా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో నెటిజన్లు రానాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.